మంతా తుఫాను ఉదృత రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు..

రెవిన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి

రాజధాని వాయిస్ : అక్టోబర్ 26 రేపల్లె

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వారి పుత్తర్వులు మేరకు రాబోవు “మంతా” తుఫాను తీవ్రతను ధృష్టి లో వుంచుకొని ఈ నెల 27, 28 ,29 అనగా సోమవారం నుండి బుధవారము వరకు బాపట్ల జిల్లా లోని అన్నీ ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు దినములుగా ప్రకటించారు. అదేవిధంగా రాబోవు మంతా తుఫాను తీవ్రతను ధృష్టి లో వుంచుకొని రేపల్లె డివిజన్లోని అన్నీ తహశీల్దారు వారి కార్యాలయములు రెవెన్యూ డివిజినల్ అధికారి వారి కార్యాలయము లయందు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అందరు పంచాయతీ స్థాయి నుంచి మండలస్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో వుంటారు. కావున ప్రజలు తమ యొక్క అత్యవసర సమస్యలను క్రింద తెలియజేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబరులు ద్వారా ప్రభుత్వ యంత్రాగమునకు తెలియజేసి పరిష్కరించు కోగలరని, ఈ అవకాశమును అందరు వినియోగించుకొన గలరని రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి సహాయం కావాలన్నాకంట్రోల్ రూం ఫోను నంబరులకు ఫోన్ చేయగలరన్నారు.

రెవెన్యూ డివిజినల్ అధికారి వారి కార్యాలయము, రేపల్లె
08648 293795
మున్సిపల్ కార్యాలయము, రేపల్లె 08648 226354
తహశీల్దారు వారి కార్యాలయము, రేపల్లె
8639217261
తహశీల్దారు వారి కార్యాలయము, అమర్తలూరు
9494027916
తహశీల్దారు వారి కార్యాలయము, భట్టిప్రోలు
8179886300
తహశీల్దారు వారి కార్యాలయము, చెరుకుపల్లి
9676459181
తహశీల్దారు వారి కార్యాలయము, కొల్లూరు
7794894544
తహశీల్దారు వారి కార్యాలయము, నగరం
9959303789
తహశీల్దారు వారి కార్యాలయము, నిజాంపట్నం
8520924882
తహశీల్దారు వారి కార్యాలయము, వేమూరు
9397601694
తహశీల్దారు వారి కార్యాలయము, చుండూరు
9492923803 ఎటువంటి సహాయం కావాలన్నా ఈ నెంబర్లకు సంప్రదించమని అన్నారు. 

Post Comment

You May Have Missed

0Shares