భారీ వర్షాలు నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి….
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
రాజధాని వాయిస్:అక్టోబర్ 23,క్రోసూరు.
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఏవైనా ఆరోగ్య సంబంధ అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ వైద్య స్పందన ఇవ్వటానికి వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం ఆవులువారిపాలెం సబ్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బంది కి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలు, శిశువుల పట్ల వర్షాలు నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. జ్వరాలు, వాంతులు, విరోచనాలు సంభవిస్తే తక్షణమే సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు ఆశా కార్యకర్తలకు తెలియజేయాలని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమతెరలు వాడాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శైలజ ఆశా కార్యకర్త సైదాబీ తదితరులు పాల్గొన్నారు.



Post Comment