భట్టిప్రోలు సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు జారీ

 వాటా 60 లక్షలు

అక్టోబర్ 24 రాజధాని వాయిస్ భట్టిప్రోలు,

గ్రామ పంచాయతిలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగంలో సర్పంచ్ దారా రవి కిరణ్మయి కి షోకాజ్ నోటీసులు జారీ అయినట్లూ బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో జరిగిన భట్టిప్రోలు పంచాయతీలో అవినీతిపై విచారణ చేయగా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని తేలింది. పంచాయితీ చట్టాన్ని అనుసరించి సర్పంచ్ రవి కిరణ్మయి కు నోటీసుల ను అధికారులు అందజేశారన్నారు. ఈ నోటీసుకు 15 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు విచారణ చేసి రూ1.80 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు అందులో 2021నుండి 2024 వరకు మూడు సంవత్సరాలలో గ్రామ సర్పంచ్ అవినీతి వాటా ప్రజా ధనం రూ. 60,09,386 లక్షలుగా నిర్ధారణ చేసి,సదరు డబ్బును తిరిగి రాబట్టుటకు, ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు తేలినందున పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి సర్పంచ్ దారా రవికిరణ్మయి పై చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి వారి షోకాజ్ నోటీసు నెం.278/2024/బి 1, 21 వ తేదీన జారీ చేశారు.సదరు సంజాయిషీ సహేతుకముగా లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు షోకాజ్ లో పేర్కొన్నారు.ఈ మేరకు భట్టిప్రోలు మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వివరణ కోరగా భట్టిప్రోలు గ్రామ సర్పంచ్ కు జిల్లా పంచాయతీ అధికారి నుండి షోకాజ్ నోటీసు వచ్చిన మాట నిజమేనని, నిబంధనల మేరకు సర్పంచ్ కు అందచేసినట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో రూ 1.80 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు ప్రత్యేక అధికారుల బృందం విచారణలో తేలగా, సదరు అవినీతిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలో రూ1.20 కోట్లు అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది.కాగా ఈ అవినీతిలో ఇప్పటికే నలుగురు అధికారులు సస్పెండ్ కాగా షోకాజ్ నోటీసుల జారీ చేయడం ద్వారా సర్పంచిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.కాగా భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని తేలింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణ చేయించి,నిజాలు నిగ్గు తేల్చి, అవినీతిపరుల సంగతి తెలుస్తానని తూనుగుంట్ల సాయిబాబా ఎన్నికలకు ముందు చేసిన సవాల్ నేడు నిజమైనట్లుంది. మరికొద్ది నెలల్లో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో నైనా నిజాయితీగా ప్రజల కోసం,గ్రామ అభివృద్ధి కోసం,అవినీతి మరకలు లేని మంచి వ్యక్తుల ప్యానల్ ఎన్నుకుంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా,గ్రామ అభివృద్ధికి దోహద పడతారని,మంచి పాలకులను తెచ్చుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.రూ.60.లక్షలు నిగ్గు తేల్చి,ప్రజాధనం తిరిగి రాబట్టటానికి సర్పంచ్ కు బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఈమేరకు మండల అధికారులు సదరు షోకాజ్ నోటీసును స్వయంగా సర్పంచ్ కు అందచేశారు.గత ప్రభుత్వ 5 సంవత్సరాల పాలనలో భట్టిప్రోలు గ్రామ పంచాయతి నందు జరిగిన రూ. 2.30 కోట్ల అవినీతిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా సంబంధిత ఆధారాలతో కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు విచారణ చేసి రూ1.80 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు,అందులో 2021నుండి 2024 వరకు మూడు సంవత్సరాలలో గ్రామ సర్పంచ్ అవినీతి వాటా ప్రజా ధనం రూ. 60,09,386 లక్షలుగా నిర్ధారణ చేసి,సదరు డబ్బును తిరిగి రాబట్టుటకు, ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు తేలినందున పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి సర్పంచ్ దారా రవికిరణ్మయి పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కోరుతూ,15 రోజులలో సంజాయిషీ ఇవ్వాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి వారి షోకాజ్ నోటీసు నెం.278/2024/బి 1, 21 వ తేదీన జారీ చేశారు.సదరు సంజాయిషీ సహేతుకముగా లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు షోకాజ్ లో పేర్కొన్నారు.ఈ మేరకు భట్టిప్రోలు మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వివరణ కోరగా భట్టిప్రోలు గ్రామ సర్పంచ్ కు జిల్లా పంచాయతీ అధికారి నుండి షోకాజ్ నోటీసు వచ్చిన మాట నిజమేనని, నిబంధనల మేరకు సర్పంచ్ కు అందచేసినట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో రూ 1.80 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు ప్రత్యేక అధికారుల బృందం విచారణలో తేలగా, సదరు అవినీతిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలో రూ1.20 కోట్లు అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది.కాగా ఈ అవినీతిలో ఇప్పటికే నలుగురు అధికారులు సస్పెండ్ కాగా,షోకాజ్ నోటీసుల జారీ చేయడం ద్వారా సర్పంచిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.కాగా భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణ చేసింది.

Post Comment

You May Have Missed

0Shares