భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పూజలు
అక్టోబర్ 24 రాజధాని వాయిస్ భట్టిప్రోలు,
నాగుల సమితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల పరిధిలో నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తిశ్రద్ధలతో పలువురు భక్తులు పూజలు నిర్వహించారు.
భట్టిప్రోలు మండలం కోనేటిపురంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం పుట్ట వద్ద నాగుల చవితి పండగ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు 200 మందికి పైగా క్యూ లైన్ లో నిలబడి పుట్టలో పాలు పోసి పూజలు చేసిసా రు.దేవాలయ భక్తులు నల్లూరిపాలెం వాస్తవ్యులు యలవర్తి వెంకటేశ్వరరావు దంపతులు పుట్ట లో పాలు పోసి పూజలు నిర్వహించారు. దేవాలయ ఆస్థాన పండితులు వంగర చలమయ్య సిద్ధాంతి.. కళావతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మ అమృతమఇ బాలస్వామి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చి దీవించారు.



Post Comment