బైబిల్ క్విజ్ విజేతలకు బహుమతుల ప్రధానం
రాజధాని వాయిస్: డిసెంబర్ 13
మాచర్ల.
పట్టణంలోని నెహ్రూ నగర్ లో సమర్పణ ప్రార్ధన మందిరం ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి బైబిల్ క్విజ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి యవనస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్విజ్ పోటీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఆధ్యాత్మిక రంగంలో యువత మరింత ప్రగతి సాధించాలని కన్వీనర్ శంకర్, బ్రహ్మనాయుడు తెలిపారు. క్విజ్ విజేతలుగా క్రీస్తు సంఘం విజయవాడ చెందిన డేనియల్ బృందం ప్రథమ బహుమతి,ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం వినుకొండ నుండి వై కోటేశ్వరరావు బృందం
ద్వితీయ బహుమతి, మాచర్ల పట్టణానికి చెందిన ఎం జయరాజు బృందం మూడవ బహుమతిని గెలుపొందారు.రానున్న కాలంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరిన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ మోహన్ బాబు, సుందర రావు, జాషువా, లాజర్, యెహోషువ, సైదులు, అభిషేక్, అనిల్,ఇజ్రాయిల్, టైటస్ జాన్ తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.



Post Comment