బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ఖండించిన బిజెపి నేత

రుషి కొండపై ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు ఖండించిన కట్టమూరి ఉమామహేశ్వర రావు 

రాజరాజధానికి నిరా వాయిస్:డిశంబర్ 2 విశాఖ రుషి కొండ ప్యాలెస్ స్టార్ హోటల్స్ కు ఇవ్వటానికి ఏపి మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పు పట్టటాన్ని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పిడుగురాళ్ల పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు కట్టమూరి ఉమామహేశ్వరరావు (ఈశ) ఖండించారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రుల కమిటీలో పార్టీకి చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఉన్నారని,కూటమి నాయకుల ఏకాభిప్రాయంతో కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు.స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోలేదని విష్ణుకుమార్ రాజు అనడం బాగాలేదని,రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు కమిటీ సిఫార్సు చేసిన ఏ నిర్ణయానికి అయిన అందరూ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.రాష్ట్ర అభివృద్దికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని, క్యాబినెట్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు.

Post Comment

You May Have Missed

0Shares