బాలా ఆదిత్య పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు
బాలా ఆదిత్య విద్యా సంస్థలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
రాజధాని వాయిస్:డిశంబర్ 21, రాజుపాలెం.
రాజుపాలెం మండలం చౌట పాపాయ పాలెం బాలా ఆదిత్య పాఠశాలలో భారతీయ మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా గణిత ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా గణిత ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, సమస్యల పరిష్కారం, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ సందర్బంగా బాల ఆదిత్య విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ బి సామా నాయక్ మాట్లాడుతూ, గణితం విద్యార్థుల తర్కశక్తి, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post Comment