ఫేక్ సోషల్ మీడియా ముసుగులో అక్రమ వసూళ్లు..

విజయవాడలో మీడియా నైతిక విలువలపై తీవ్ర దాడి..

అక్రమ సంపాదనే ధ్యేయంగా రెచ్చిపోతున్న కొందరు యూట్యూబర్లు (సోషల్ మీడియా)…

 

అక్రమ వసూళ్ళు టార్గెట్ గా అర్ధరాత్రులు రోడ్లమీద తిరుగుతున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలి..

 

సుయోమోటో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి – నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) డిమాండ్..

 

విజయవాడ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు…

 

రాజధాని వాయిస్ :జనవరి 12

విజయవాడ.

 

మీడియా నైతిక విలువలపై జరుగుతున్న తీవ్రమైన దాడిని అరికట్టేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తక్షణమే జోక్యం చేసుకుని సుయోమోటో కేసులు నమోదు చేయాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు డిమాండ్ చేసారు. ఈ మేరకు నారా ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డా. బండి సురేంద్రబాబు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ప్రతినిధిత్వం సమర్పించారు.

 

అర్ధరాత్రి బెదిరింపులు – సంఘటిత నేరంగా మారిన ఫేక్ జర్నలిజం

 

విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్హతలేని, నమోదు కాని వ్యక్తులు జర్నలిస్టుల ముసుగు ధరించి అర్ధరాత్రి పూట రైస్ మిల్లులు, గోడౌన్లు, వ్యాపార సంస్థలు, లారీలు, ఆటోలు, ఇతర వాహనాలను అడ్డగించి “వార్త వేస్తాం, వీడియోలు పెడతాం,అధికారులకు ఫిర్యాదు చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) ఆరోపించింది. 

ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న చర్యలు కాదని, పూర్తిస్థాయి ఆర్గనైజర్ మీడియా ఎక్స్టర్షన్ రాకెట్ గా మారిందని పేర్కొంది.

 

ఆర్ ఎన్ ఐ గుర్తింపు లేని పత్రికలు/అనధికార యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా మాఫియా పాత్ర

 

ఆర్ ఎన్ ఐగుర్తింపు లేని పత్రికలు, నమోదు కాని డిజిటల్/డార్క్ మీడియా సంస్థలు యువతను ఆకర్షిస్తూ రిపోర్టర్ బ్యూరో చీఫ్,డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్, వంటి హోదాలతో నకిలీ ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) ఆరోపించింది. ఈ ఐడీ కార్డుల ద్వారానే బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు వ్యవస్థాగతంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపింది.

 

నిజమైన జర్నలిస్టులపై ప్రభావం

 

ఫేక్ జర్నలిస్టుల దందాల వల్ల నిజమైన జర్నలిస్టులపై ప్రజల్లో అనమ్మకం పెరిగిందని, జర్నలిజం వృత్తి గౌరవం దెబ్బతింటోందని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) ఆవేదన వ్యక్తం చేసింది. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఏ) స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.

 

జర్నలిజం వ్యాపారం కాదు- సేవ..

జర్నలిజం అంటే బ్లాక్ మెయిల్ కాదు జర్నలిజం అంటే సేవ, బాధ్యత, నైతికత. ఫేక్ మీడియా మాఫియాపై తక్షణ చర్యలు తీసుకోకపోతే శాంతిభద్రతలకు ముప్పు తప్పదని డా. బండి సురేంద్రబాబు, విజయవాడ పోలీస్‌ కమిషనర్ రాజశేఖర్ బాబుని కోరారు.

Post Comment

You May Have Missed

0Shares