ఫేక్ కేసులతో భయపెట్టలేరు…

 మాజీ మంత్రి విడదల రజిని

రాజధాని వాయిస్:
నవంబర్ 8
చిలకలూరిపేట.

మాజీ మంత్రి విడదల రజిని తానపై నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రతీకారమేనని ఆరోపించారు.ఫేక్‌ కేసులతో భయపెట్టలేరని, ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. ఉద్యోగాల మోసానికి తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఆ మోసానికి పాల్పడిన గణేష్‌ టీడీపీ కార్యకర్తేనని
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కొందరు టీడీపీ నేతలు అనుకూల పోలీసులను ఉపయోగించి తప్పుడు కథనాలు అల్లి కేసులు పెట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. గణేష్‌పై గతంలో దర్శి, చిలకలూరిపేట స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, అతనిపై పలు ఫిర్యాదులు మంత్రి లోకేష్‌ వద్దకూ వెళ్లాయని తెలిపారు.రాజకీయ కుట్రలతో తమపై ఇప్పటి వరకు ఏడు తప్పుడు కేసులు పెట్టారని,ఇవన్నీ వైఎస్సార్‌సీపీ బలపడటాన్ని అడ్డుకునే ప్రయత్నమని వ్యాఖ్యానించారు.ఫేక్ కేసులపై డిఫర్‌మేషన్‌, మానవ హక్కుల పోరాటం చేస్తానని హెచ్చరించారు.

Post Comment

You May Have Missed

0Shares