ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలను పాటించాలి..
రాజధాని వాయిస్:అక్టోబర్ 25 రేపల్లె
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తప్పనిసరిగా రహదారి భద్రత నిబంధనలను పాటించాలని బాపట్ల మోటార్ వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి యాజమాన్యానికి తెలియజేశారు. శనివారం రేపల్లె నుంచి బెంగళూరు వెళ్లే ట్రావెల్ బస్సులో ఆమె తనిఖీలు నిర్వహించారు. నిర్దిత వేగంతో వాహనాలను నడపాలని డ్రైవర్లకు సూచించారు. బస్సులలో ప్రథమ చికిత్స కు సంబంధించిన మందులు లాంటివి అన్ని సమకూర్చాలని తెలియపరిచారు. అవసరమైన సేఫ్టీ మెటీరియల్స్ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేశారు. బస్సు ఫిట్నెస్ కి వెళ్ళినప్పుడు చూపించిన విధంగానే సీట్లు ఉండాలని బయటికి వెళ్లిన తర్వాత కూడా బస్సులు అలాగే ఉంచాలని అంతకుమించి దానిని మార్చితే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.



Post Comment