ప్రెస్ క్లబ్ సభ్యుల ఆద్వర్యంలో చిన్నారి అనన్య పుట్టినరోజు వేడుకలు

ప్రశాంతి వృద్ధాశ్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యుడి కుమార్తె అనన్య జన్మదిన వేడుకలు*

రాజధాని వాయిస్:నవంబర్ 24,చిలకలూరిపేట.

 

ముఖ్య అతిథిగా ఐ న్యూస్ రిపోర్టర్ ఆలపాటి ఆంజనేయులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్

చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. క్లబ్ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు అయిన పెనుమల మనోహర్ లపట్టి అనన్య జన్మదిన వేడుకలను ఆదివారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిలకలూరిపేటలోని ప్రశాంతి వృద్ధాశ్రమం వేదికైంది.ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, ఐ న్యూస్ రిపోర్టర్ ఆలపాటి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి, జన్మదినం జరుపుకుంటున్న పాపను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని, చిన్నారిని దీవించారు.జన్మదిన వేడుకల అనంతరం, మనోహర్ కుటుంబ సభ్యులు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి వృద్ధులకు ఆహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వృద్ధులతో కలిసి ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని, వారి ఆశీస్సులు పిల్లలకు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు.ప్రశాంతి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు, ప్రెస్ క్లబ్ సభ్యుల ఐక్యతను, అలాగే వారి సామాజిక బాధ్యతను చాటిచెప్పాయి. ఆశ్రమంలోని వృద్ధులు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకుని, చిన్నారిని మనస్ఫూర్తిగా దీవించడం ఈ కార్యక్రమానికి మరింత శోభను తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లు అడపా అశోక్ కుమార్, ఎన్ వి ఎస్ ప్రసాద్ (వార్త)సెక్రటరీ షేక్ దరియావలి, సయ్యద్ సిద్ధి, ఉప్పాల సుభాని (c.c), కొండపాటి రమేష్, తదితరులు ఉన్నారు.

Post Comment

You May Have Missed

0Shares