ప్రశ్నించడం పౌర హక్కు-మౌనం వద్దు,అవినీతిపై యుద్దం చేద్దాం
*ప్రశ్నించడం పౌర హక్కు – మౌనం వద్దు.. అవినీతిపై యుద్ధం చేద్దాం*
*సమాచార హక్కు చట్టం (RTI)తో అక్రమాలకు చరమగీతం
*పల్నాడు జిల్లాలో జోరుగా RTI అవగాహన సదస్సులు*
*యువతకు సభ్యత్వ నమోదు కోసం పిలుపు*
సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సంఘం పల్నాడు జిల్లా కన్వీనర్ స్వర్ణ శివ
రాజధాని వాయిస్:నరసరావుపేట, ఫిబ్రవరి 24.
“ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా” అని సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం పల్నాడు జిల్లా కన్వీనర్ స్వర్ణ శివ స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం ఫౌండర్ & చైర్మన్ జి. ముత్తు ఆదేశాల మేరకు, రొంపిచర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ‘సమాచార హక్కు చట్టం’ అని, దీని ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను పెంచవచ్చని స్వర్ణ శివ వివరించారు. “ప్రశ్నించడం తప్పు కాదు.. మౌనంగా ఉండి అన్యాయాన్ని భరించడమే తప్పు” అని ఆయన పౌరులను చైతన్యపరిచారు. ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగంలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టేందుకు ప్రతి ఒక్కరూ RTI ని వినియోగించుకోవాలని కోరారు. అవినీతి రహిత పల్నాడు జిల్లాను రూపొందించేందుకు యువత నడుం బిగించాలని స్వర్ణ శివ పిలుపునిచ్చారు. సంఘంలో నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల పౌరులు మరియు యువత సంఘం అధికారిక వెబ్సైట్: https://www.rtiassociation.com > ద్వారా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, గ్రామస్థులు మరియు సంఘ కార్యకర్తలు పాల్గొని RTI చట్టంపై పూర్తి అవగాహన పొందారు.
Post Comment