ప్రదాన మంత్రి నరేంద్ర మోడి వాచ్ రేటు ఎంతో తెలుసా!
*ప్రదాని మోడీ “వాచ్” రేటు ఎంతో తెలుసా!*
రాజధాని వాయిస్:న్యూఢిల్లీ.
భారతీయ కళలు, సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. తాజాగా మోడీ ధరించిన “వాచ్”పై అందరి దృష్టి నెలకొంది. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ మోడీ చేతికి కనిపించింది. దీనిపేరు “రోమన్ బాఘ్”.మోడీ ధరించిన ఈ వాచ్లో 1947లో విడుదలైన ఒక రూపాయి నాణెం ఉండటం దీని అసలు ప్రత్యేకత. దీని ధర రూ.55,000- రూ.60,000 మధ్య ఉంటుందని అంచనా.



Post Comment