ప్రతి ఇంట సిరిసంపదలు, సకల సంతోషాలు వెల్లివిరియాలి…
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు…
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..
రాజధాని వాయిస్: జనవరి 13
నరసరావుపేట…
ప్రతి ఇంట సిరిసంపదలు, సకల సంతోషాలు సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కష్టించి పండించిన ధాన్యపు రాశులు ఇంటికొచ్చే సమయంలో రైతులు, అలాగే అన్ని వర్గాల ప్రజలు ఈ తెలుగువారి పెద్ద పండుగ నాడు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిచారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమలో కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కుటుంబాలతో ఈ పండుగను వేడుకగా జరుపుకోవాలని కోరారు.



Post Comment