ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు

 

అక్టోబర్ 19
రాజధాని వాయిస్ :
బాపట్ల.

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
నేడు దీపావళి పండుగ సందర్బంగా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి అర్జీలు ఇవ్వడానికి ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన ప్రకటనలో తెలియజేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.

Post Comment

You May Have Missed

0Shares