ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
రాజధాని వాయిస్: నవంబర్ 8
మాచర్ల.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నవంబర్ 12న జరిగే నియోజకవర్గ స్థాయి ర్యాలీల ప్రచార పోస్టర్‌ను పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉద్యమం కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



Post Comment