ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలి
• ఎమ్మెల్యే బొండా ఉమ
అక్టోబర్ 21 రాజధాని వాయిస్ : విజయవాడ.
సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్, పాయకాపురం జే ఎన్ సి చర్చి ప్రాంగణంలో జెఎన్ సి మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో,ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా బొండా ఆయన మాట్లాడుతూ, జె ఎన్ సి మినిస్ట్రీస్ వారు చేపట్టిన ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్యాంపులో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు వివిధ హాస్పెటల్స్ వారు పాల్గొని, వివిధ విభాగాలలో రోగులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, క్యాంపులో కార్డియాలజీ (గుండె సంబంధిత), ఆర్థోపెడిక్స్ (ఎముకలు మరియు కీళ్ల సంబంధిత), డెంటల్ (దంత సంబంధిత), ఆప్తమాలజీ (కంటి సంబంధిత), గైనకాలజీ (స్త్రీల ఆరోగ్య సంబంధిత), పీడియాట్రిక్స్ (పిల్లల ఆరోగ్య సంబంధిత), మరియు జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు తమ సేవలను అందిస్తున్నారు అని, ఈ వైద్య నిపుణులు రోగుల ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సరైన చికిత్స మరియు సలహాలను అందిస్తున్నారని, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో అను ఒమేగా హాస్పిటల్, ఎనికేపాడు; అమరావతి ఐ హాస్పిటల్; దూహిత డెంటల్ హాస్పిటల్; మరియు హియర్ జాప్ హాస్పిటల్ వంటి ప్రముఖ వైద్య సంస్థలు భాగస్వామ్యం వహించి, తమ నిపుణులైన వైద్య బృందాలను పంపించి, ప్రజలకు విలువైన వైద్య సేవలను అందిస్తున్నారు అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, బిషప్ రబ్బునీ, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ తోపాటు ప్రజలు పాల్గొన్నారు.



Post Comment