ప్రకృతి సేద్యమే భవిష్యత్ జీవన విధానం
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
రాజధాని వాయిస్: నవంబర్ 8
మాచర్ల.
ప్రకృతి సేద్యమే భవిష్యత్ జీవన విధానమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మాచర్ల మండలంలో పర్యటించిన ఆయన పెద్ద అనుపు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి సహజ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సహజ సిద్ధంగా తయారు చేస్తున్న కషాయాలను, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సిద్దం చేసిన ఎరువులను స్వయంగా పరిశీలించి, వాటి వాడే పద్దతులను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతుల మూసదోరణి యాజమాన్య పద్దతులు నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మరలినప్పుడు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని సూచించారు. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే ఉత్పత్తులకే ప్రపంచ విఫణిలో మంచి డిమాండ్ ఉంటుందని జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళి, తహశీల్దార్ కిరణ్ కుమార్, మాచర్ల రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post Comment