ప్రకృతి వ్యవసాయమే రైతులకు లాభసాటి: బివి శ్రీనివాస్.
రాజధాని వాయిస్: డిసెంబర్ 23, భట్టిప్రోలు.
ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు అలవాటు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం ద్వారా పేదరికం తగ్గించవచ్చునని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ఎన్ ఎఫ్ ఏ బి వి శ్రీనివాస్ అన్నారు. భట్టిప్రోలు మండల సమాఖ్య కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక మండల సమాఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో తహసిల్దార్ మేక శ్రీనివాసరావు, ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ,ఏపీఎం గుడిమెట్ల శ్రీమన్నారాయణలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు చేరువ చేయడంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,డి ఆర్ డి ఎ -వెలుగు, వ్యవసాయ శాఖ సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ప్రకృతి వ్యవసాయ విధానంలో ముఖ్యంగా 365 రోజులు భూమిపై పంటలు ఉండాలని, పంట వైవిధ్యత లో భాగంగా కంచ పంటలు,అంతర పంటలు సాగు చేయాలని,దేశీయ సొంత విత్తనాలను విత్తుకోవాలని తెలిపారు.తేలికపాటి దుక్కులు దున్నాలని, భూమిలో సూక్ష్మక్రిముల వ్యాప్తికి పిఎండిఎస్ సాగు చేయాలని,జీవ ఉత్ప్రే రకాలైన ఘన,ద్రవ జీవామృతాలను వాడాలనన్నారు. పురుగులు,తెగుళ్ల నియంత్రణకు ఔషధ గుణాలున్న ఆకులతో తయారు చేసిన కషాయాలు వాడాలని, మొక్క పెరుగుదలకు , పూత,పిందే బాగా రావడానికి కోడిగుడ్డు,నిమ్మరసం ద్రావణం,చేప,బెల్లం ద్రావణం వాడాలని తెలియజేసారు. వెలుగు ఏపిఎం గుడిమెట్ల శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కుటుంబాలు వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నాయని, ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు అలవాటు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుట ద్వారా పేదరి కాన్నీ తగ్గించవచ్చని తెలియజేసారు. పర్యావరణ పరిరక్షణకు,మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, భూమి ఆరోగ్యం మెరుగుపరచడానికి, ప్రకృతి విపత్తుల నుండి పంటలను రక్షించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయ మన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతులు పానుగంటి సూరిబాబు మరియు కాట్రగడ్డ శ్రీనివాసరావు లను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయమండల ఎఫ్ ఎం టి లు దోవ ఝాన్సీ రాణి,బాలాజీ సురేష్,వెలుగు క్లస్టర్ కోఆర్డినేటర్స్,కె.రజిని కుమారి,పి నరేంద్ర,హానుకు వి ఏ ఏ లు,వీహెచ్ఏ లు,సి డి ఐ రత్న కిషోర్ మండల సమాఖ్య ప్రతినిధులు,ధనలక్ష్మి , గ్రామ సమైక్య ప్రతినిధులు, యానిమేటర్స్, మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment