పోలీసు అమరవీరుడా నీకు వందనం
పోలీస్ వ్యవస్థ లేని సమాజం ఊహించడం కష్టం
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా
ఎస్పీ బి.కృష్ణా రావు
రాజధానివాయిస్:అక్టోబర్ 21,నరసరావుపేట.
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ కృతిక శుక్ల హాజరయ్యారు.నర్సరావుపేట పట్టణం లింగంగుంట్ల లోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు పల్నాడు జిల్లా ఏ ఆర్ డి.ఎస్.పి జి.మహాత్మగాంధీ గారి పర్యవేక్షణలో అడ్మిన్ ఆర్.ఐ యం.రాజా పరేడ్ కమాండర్ గా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పోలీస్ అమర వీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి పోలీసు వారు చేసే సేవలు అనిర్వచనీయమని, పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని మనం ఊహించలేం అన్నారు.పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డువుండదని, దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారాకాస్తు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తున్నారు.ఈ క్రమంలో ఎంతోమంది పోలీస్ వారు సంఘవిద్రోహ శక్తులను అణచివేసే క్రమంలో తమ ప్రాణాలను అర్పించి అసువులు బాసినారు. వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు.ఎస్పీ.కృష్ణా రావు మాట్లాడుతూ 21 అక్టోబర్ 1959 న భారత సైన్యం లఢక్ లోని హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణ ను కరమ్ సింగ్,డీఎస్పీ నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో కరమ్ సింగ్ తో పాటు 10 మంది భారత సైనికులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, అక్టోబర్ 21 తేదిన అమర వీరుల సంస్మరణ దినంగా రోజు జరుపుకుంటున్నాం అన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని పునికి పుచ్చుకొని భవిష్యత్తులో సమాజానికి ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తామని పల్నాడు జిల్లా పోలీసు తరఫున తెలుపుకుంటున్నానని అన్నారు. అరవింద బాబు మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికులు దేశంలోనీ పోలీసు వారు నిరంతర కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు.ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా వీర మరణం పొందిన ఒక ఎస్ఐ, 8 మంది పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి, వారికి పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తరపున జ్ఞాపికలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె.వి.సంతోష్ పరిపాలన విభాగం.అదనపు ఎస్పీ క్రైమ్ సిహెచ్. లక్ష్మీపతి , ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తి రాజు సత్తెనపల్లి డీ.ఎస్పీ యం.హనుమంత రావు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఎం. వెంకట రమణ,ఏ ఆర్ ఎసై మహాత్మా గాంధీ సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ టి మాణిక్యాల రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Post Comment