పోలీసుల సేవలు వెలకట్టలేనివి..
జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్
అక్టోబర్ 21 రాజధాని వాయిస్: బాపట్ల
దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు విధి నిర్వహణలో నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని, వారి సేవలు వెలకట్టలేని అని బాపట్ల జిల్లా కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హాజరై పోలీసు అమరువీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పీ గ్లోరియా,డీఎంహెచ్ఓ,బాపట్ల, రేపల్లె, చీరాల డీఎస్పీ , బాపట్ల తహసీల్దార్ ఎస్ కె సలీమా,పట్టణ సీఐ రాంబాబు,సీఐలు, ఎస్ఐలు,పోలీస్ సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment