పోలీసుల క్రమశిక్షణ, ఆరోగ్యానికి యోగాసనాలు..
రాజధాని వాయిస్ నవంబర్ 9
మాచర్ల.
పోలీసు శాఖలో క్రమశిక్షణతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మాచర్ల అర్బన్ సీఐ టి. వెంకటరమణ ఆధ్వర్యంలో యోగాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అనంతకృష్ణ, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం సమయానికే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో యోగా గురువుల మార్గదర్శకత్వంలో పలు యోగాసనాలు చేశారు. పోలీసు సిబ్బంది రోజు వారీ ఒత్తిడిని తగ్గించడంలో, మనసు ప్రశాంతంగా ఉంచడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందని సీఐ వెంకటరమణ తెలిపారు. ప్రతి రోజు కొద్ది సమయం కేటాయించి యోగాసనాలు చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని సూచించారు. ఈ కార్యక్రమం పోలీసు సిబ్బందిలో సానుకూల ఆలోచనలతో పాటు ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచిందని అధికారులు తెలిపారు



Post Comment