పోటీ పరీక్ష లలో వివేకానంద పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాట వివేకానంద పాఠశాల

పోటీ పరీక్షలలో వివేకానంద పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విద్యార్థుల అంతర్గత వికాసంతోస్టేట్ ర్యాంకులు

రాజధాని వాయిస్:జనవరి 6,పిడుగురాళ్ల.

వ్యక్తి ఎదుగుదల,సామాజిక అభివృద్దికి విద్య అవసరం. విద్యార్ధిలో ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీయడంలో పిడుగురాళ్ళ పట్టణంలో ఉన్న వివేకానంద పాఠశాల ముందు ఉంటుంది. మొన్న గణితం,నేడు సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలో వివేకానంద విద్యార్థి షేక్ సైదాకి స్టేట్ 2వ ర్యాంక్. పోటి పరీక్ష ఏదైనా ర్యాంక్ లు వివేకానంద పబ్లిక్ స్కూల్ విద్యార్థులకే సొంతం.ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళుడిసెంబర్ 24 తేదీ నిర్వహించిన సి.వి రామన్ సైన్స్ ఒలంపియాడ్ లో పిడుగురాళ్ల పట్టణంలోని వివేకానంద పాఠశాల 8వ తరగతి విద్యార్థి షేక్ సైదా వందకి 96 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. సైన్స్ ఒలం పియాడ్ రాష్ట్రస్థాయిలో రెండవ స్థానాన్ని సాధించిన ఫేక్ సైదా కు డైరెక్టర్ రామకృష్ణ మాస్టర్ ప్రిన్సిపాల్ సుప్రియ ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.పోటీ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ నిర్వహించిన వివేకానంద విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించటం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ద,కార్యదీక్ష పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వం సాధించేలా విద్యార్థులు నేర్చుకునే విధంగా తర్పీదు ఇస్తూన్నారని తల్లితండ్రులు అభిప్రాయం.విద్యార్ధి అంతర్గత వికాసంతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాట వేస్తున్నారు.నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్నీ విధాలుగా రాణించడానికి వివేకానంద పాఠశాల ఒక చక్కని వేదిక.ఎల్కేజీ నుండి 10 తరగతి వరకు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మానసికంగా విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నారు.ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎక్కడికి వెళ్లిన రాణించడానికి కారణం డైరెక్టర్ రామకృష్ణా మాస్టర్ విద్యార్థుల పట్ల గల అంకిత భావం,కార్యదీక్ష వల్ల వివేకానంద విద్యార్థులు అన్నీ పోటీ పరీక్ష లలో మంచి ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Post Comment

You May Have Missed

0Shares