పేకాట శిబిరంపై ఎస్సై దాడి
రాజధాని వాయిస్ : కొల్లూరు.అక్టోబర్ 21
పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొల్లూరు ఎస్ఐ జానకి అమర వర్ధన్ తెలిపారు. మంగళవారం ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కొల్లూరు కరకట్ట దిగువన పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తమ సిబ్బందితో పేకాట శిబిరం పై దాడి చేయగా రూ.4950 లను, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు.



Post Comment