పూరిల్లు దగ్ధం…

 లక్షల ఆస్తి నష్టం

రాజధాని వాయిస్ :
ఫిబ్రవరి 21
వేమూరు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైన సంఘటన మండల సమీప గ్రామమైన కొత్తపాలెం లో శనివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు కుంచే హేమ సుందరరావు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి భోజనాలు అయిన అనంతరం విశ్రమించామన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కట్టుబట్టలతో బయటకు వచ్చామన్నారు. విషయం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని. అయినప్పటికీ పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు హేమ సుందర రావు తెలిపారు.ఇంటిలో రెండు పోర్షన్లలో తన తండ్రి కుంచే శ్రీనివాసరావు,మరో భాగంలో తాము ఉంటున్నట్లు తెలిపారు.అగ్ని ప్రమాదంలో 20 షవర్ల బంగారం,లక్షల్లో నగదు,మినుము బస్తాలు ముడి బియ్యం,రెండు బీరువాలు టీవీలు, ఫ్రిజ్ అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు.
పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.మండల రెవెన్యూ అధికారి ఆదేశాల మేర విఆర్ఓ జి రాజరాజేశ్వరి సంఘటన స్థలానికి విచ్చేసి పరిశీలించిన అనంతరం ప్రభుత్వ సాయంగా 25 కిలోలు బియ్యాన్ని బాధితుల కుటుంబానికి అందించారు. వేమూరు విద్యుత్ శాఖ ఏ ఈ పి శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, పెనుమర్రు సాగునీటి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కిలోల బియ్యం రూ 5 వేల నగదు అందించారు.గ్రామ ఉపసర్పంచ్ సోమరవుతూ శివపద్దయ్య,టిడిపి నాయకులు లంకోజి మల్లేశ్వరరావు, గోపాలం రామ బసవ ప్రసాద్,లంకోజి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, తోట వెంకట సుబ్బారావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Post Comment

You May Have Missed

0Shares