పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి..

రాజధాని వాయిస్ : ఫిబ్రవరి 07 

కొల్లూరు.

 

పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాల్సిన బాధ్యత తల్లుల పై ఉందని ఏఎన్ఎం కృష్ణప్రియ అన్నారు. శనివారం స్థానిక గౌడపాలెం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం కృష్ణప్రియ మాట్లాడుతూ, ప్రతినెల మొదటి శనివారం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు గర్భవతులకు వైద్య సహాయ అందజేయిస్తామన్నారు . ప్రతినెల పిల్లలకు అందాల్సిన టీకాలను తప్పనిసరిగా వేయించాలన్నారు. గర్భవతి గర్భం దాల్చిన వెంటనే అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకుని ప్రభుత్వం వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జరిగిన తల్లుల సమావేశంలో అంగన్వాడీ కార్యకర్త ఆదిలక్ష్మి మాట్లాడుతూ,

 సేవా సేతు కార్యక్రమం వివరాలు తల్లిదండ్రులకు వివరించారు. కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సిడిపిఓ లక్ష్మీదేవి సూచనలతో అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు ఈ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా దాతలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తువులను సమకూరుస్తే వారికి కలెక్టర్ ప్రశంస పత్రాలను అందిస్తారన్నారు. కనుక ప్రజలు అంగన్వాడి కేంద్రాల కు మౌలిక సదుపాయాలను సమకూర్చే విధంగా సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి నాగజ్యోతి పార్వతి సుబ్బమ్మ తల్లులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares