పిఈటి అసోసియేషన్ కోశాధికారిగా చేబ్రోలు శ్రీనివాసరావు

 

రాజధాని వాయిస్: భట్టిప్రోలు. అక్టోబర్ 27 

 

బాపట్ల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల కోశాధికారిగా తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు చేబ్రోలు శ్రీనివాసరావు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందలూరి రామకోటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  బాపట్ల వి కన్వెన్షన్ హాలులో బాపట్ల జిల్లా పిడి మరియు పిఈటీ అసోసియేషన్ కు 2025-27 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ మరియు బాపట్ల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికలకు స్టేట్ అబ్జర్వర్ గా వినయ్ పల్నాడు ప్రెసిడెంట్  స్వర్ణ రాజు,సెక్రటరీ ఖాదర్ మస్తాన్,శరత్, విష్ణు ముఖ్య అతిధులుగా విచ్చేశారన్నారు.నూతన అధ్యక్షుడిగా యం సాంబశివరావు,ప్రధాన కార్యదర్శిగా నారాయణ, కోశాధికారిగా భట్టిప్రోలు వ్యాయామ ఉపాధ్యాయులు చేబ్రోలు శ్రీనివాసరావు ను ఎన్నుకోవడం జరిగిందని రామకోటేశ్వరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులికొండ మల్లికార్జునరావు, ప్రధానోపాధ్యాయులు చందలూరి రామకోటేశ్వరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ అత్తోట సుగుణ, ఉపాధ్యాయులు కె కోటేశ్వరమ్మ,చన్న వెంకట ఉమామహేశ్వరరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, మురళీధరరావు,సుబ్బారావు,లక్ష్మీపార్వతి, సత్యరత్న తదితర ఉపాధ్యాయులు పాఠశాలలలో జరిగిన సన్మాన సభలో చేబ్రోలు శ్రీనివాసరావు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోశాధికారి పదవికి వన్నె తేవాలని అభినందించి సత్కరించారు.

Post Comment

You May Have Missed

0Shares