పశువులు మన సాంప్రదాయంలో భాగం…

మాచర్ల శాసనసభ్యుడు

జూలకంటి బ్రహ్మానందరెడ్డి

 

రాజధాని వాయిస్ :జనవరి 08 దుర్గి.

 

పాడి పశువులు మన సాంప్రదాయంలో భాగమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 72వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల పందేల ప్రారంభోత్సవం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

పోటీలో పాల్గొన్న ఎడ్ల యజమానులను పరిచయం చేసుకుని అభినందించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,పశు సంపద వృద్ధి చెందినప్పుడే పంటలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఎడ్ల పందేలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం పట్ల కమిటీ సభ్యులను అభినందించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటేనే భావితరాలు బాగుంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

  ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares