పల్నాడు జిల్లా మొదటి కలెక్టర్ శివ శంకర్ జన్మదిన వేడుకలు

ప్రజా కలెక్టర్ లోతేటి శివ శంకర్ 

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్ పాల్ 

 

పల్నాడు జిల్లా, నరసరావుపేట…

 

ప్రజా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాల మహానాడు, ఉద్యోగ సంఘాలు మరియు పలు సంఘాలు*
నరసరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఆ యొక్క నూతన జిల్లాలో మొట్టమొదటి దళిత కలెక్టర్ గా పనిచేసి ఎంతోమంది ప్రజలకు అందుబాటులో ఉండి విస్తృత సేవలు అందించిన శ్రీ లోతేటి శివశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలనాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాల మహానాడు మరియు ఉద్యోగ సంఘాలు అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం కేకును కట్ చేసి ఆ యొక్క వృద్ధుల ఆశీర్వాదాలు లోతేటి శివశంకర్ గారికి ఉండాలని తదుపరి ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ ఈ జిల్లాలో ఎంతోమంది వికలాంగులకు వృద్ధులకు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఒక కలెక్టర్ గా కాకుండా సామాన్యుడిగా అందుబాటులో ఉం టూ విశిష్ట సేవలను అందించి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కారం చేస్తూ నవోదయం పేరిట ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఎంతోమందికి లోన్ల ద్వారా ఫోర్ వీలర్ లను అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న శ్రీ లోతేటి శివశంకర్ గారు భవిష్యత్తులో పేద ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎక్కడ పని చేసినా కొత్త పథకాలతో ప్రజల ఆశీస్సులు పొందుతూ ప్రజా కలెక్టర్ గా మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకున్నారు …
ప్రభుత్వ వైద్యశాలతో పాటు వృద్ధాశ్రమంలో పండ్లు ఫలాలు పంపిణీ చేయడంతో పాటు కేకును కట్ చేసిన వారిలో DR T A కుమార్, T రజనీ,DV స్వామి, చార్వాక యూత్ అధ్యక్షులు డేవిడ్ విల్సన్, నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షుడు విస్తాల జయరావు, జన జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, సెయింట్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, ఎంఐఎం నాయకులు కరీముల్లా, మాలమహానాడు నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు అంబటి రామయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామేలు,మండల అధ్యక్షులు ముచ్చు బ్రహ్మం,రొంపిచర్ల మండల యూత్ అధ్యక్షుడు బూదాటి సంసోను, దార్ల రాయన్న, పట్టణ కార్యదర్శి మెడబలిమి సాంబశివ, గదా నీలాంబరం,కొండ్రు యేసుపాదం,కొండా ప్రకాష్, వాసుపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు …
జై భీమ్ ….

Post Comment

You May Have Missed

0Shares