పత్తి చేలో రక్త పింజర్, పాము కాటుతో మహిళ మృతి

పత్తి చేలో రక్త పింజర్ పాము కాటు, మహిళా కూలీ మృతి

రాజధాని వాయిస్:నవంబర్ 17,చిలకలూరిపేట.

చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగన్న పాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూలి పనులకు వెళ్లిన ఓ వివాహితను పాము కాటు వేయడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
గంగన్న పాలెం గ్రామానికి చెందిన జటావతు ప్రియంతి బాయి (26), భర్త గణేష్ నాయక్. ఈమె ఈరోజు ఉదయం సుమారు 9:00 గంటలకు కోమిటినేని వారిపాలెం గ్రామ సమీపంలో మురుకుంట్ల శివప్రసాద్ అనే వ్యక్తికి చెందిన పొలంలో పత్తి తీసే కూలి పనికి వెళ్లారు. ఉదయం 11:45 గంటల సమయంలో పొలంలో పని చేస్తుండగా ఆమె ఎడమ కాలు యాంకిల్ (చీలమండ) వద్ద రక్తపింజర పాము కాటు వేసింది.పాము కాటు వేసిన వెంటనే తోటి కూలీలు ఆమెను చికిత్స నిమిత్తం చిలకలూరిపేటలోని వీర శంకర్ హాస్పిటల్‌కు ఆటోలో తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే విషం వేగంగా శరీరమంతా వ్యాపించడంతో ప్రియంతి బాయి మృతి చెందింది. ఈమెకు 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది, అయితే వీరికి పిల్లలు లేరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Post Comment

You May Have Missed

0Shares