పచ్చ వర్ధంతి సందర్భంగా అన్నదానం
పచ్చ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం
రాజధాని వాయిస్:నవంబర్ 13,సత్తెనపల్లి
సత్తెనపల్లి మండలం కంకణనపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయవాది, రైతు సంఘం నాయకుడుపచ్చ రఘునాథ్ రావు 11వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ మాతృశ్రీ మల్లబాంబ వృద్ధాశ్రమంలో జనవిజ్ఞానవేదిక అధ్వర్యంలో పచ్చ శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పేదలకు. వృద్ధులకు, వికలాంగులకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీనివాస్ కోరారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు కొండలు తదితరులు పాల్గొన్నారు.



Post Comment