జాతీయ కాంగ్రెస్ పార్టీ అభిమాని, భట్టిప్రోలు పంచాయతీ బోర్డు మాజీ సభ్యులు వేల్పూరి వెంకట కోటేశ్వరరావు మంగళవారం అకాల మృతి చెందారు. ఉదయం ఎనిమిది గంటలకు వార్తాపత్రికను చదువుతూ ఒక్క మారుగా కుప్పకూలిపోయాడు. కోటేశ్వరరావు 1986.. 91 మధ్యకాలంలో భట్టిప్రోలు వ్యవసాయ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా,1988..95 మధ్యకాలంలో తూనుగుంట్ల రామమోహనరావు సర్పంచిగా చేస్తున్న సమయంలో పంచాయతీ బోర్డు సభ్యులుగా పనిచేసి గ్రామానికి ఇతోదిక సేవ చేశారు.ఈయనకు భార్య,ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె కలరు. ఈయన చిన్న కుమారుడు ఆంధ్ర ప్రదేశ్ యువ కాపునాడు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈయన మృతి తెలుసుకున్న గ్రామానికి చెందిన పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం తెలిపిన వారిలో సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ వేల్పూరి నాగేశ్వరరావు, తూనుగుంట్ల సాయిబాబా,యర్రం శెట్టి నందీశ్వర రావు, దేవినేని రామచంద్రరావు, కుంచే వెంకటేశ్వరరావు, కుంచే శంకరరావు, లక్ష్మీ ప్రసన్న కుమార్, పలు పార్టీల నాయకులు,గ్రామ పెద్దలు ఉన్నారు
Post Comment