న్యాయ వ్యవస్థ మీద దాడిపై ఖండన
రాజధాని వాయిస్:అక్టోబర్ 21,పిడుగురాళ్ల.
పిడుగురాళ్ల పట్టణంలో సీజే గవాయిపై దాడిని ఖండిస్తూ దళిత సంఘ నాయకులు రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిపై బూట్ విసరటం దారుణమని,సిజే కు దేశంలో భద్రత లేదని,ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.సిజే పై దాడి చేయటం అంటే భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.



Post Comment