నేడు ఆయుర్వేద వైద్యశాలకు శంకుస్థాపన: తూనుగుంట్ల సాయిబాబా
రాజధాని వాయిస్ డిసెంబర్ 23 భట్టిప్రోలు,
మండల కేంద్రమైన భట్టిప్రోలు లో ఆయుర్వేద వైద్యశాలకు బుధవారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధవారం ఉదయం 10 గంటలకు భట్టిప్రోలు గ్రామములోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి భవనం పురాతనమై, పడిపోవటానికి సిద్ధంగా ఉన్నందున నూతన భవన నిర్మాణమునకు శంకుస్థాపన జరగనున్నట్లు తెలిపారు.ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి 35-00 లక్షలు గ్రాంట్ మంజూరైనవనీ. సదరు పురాతన భవనాన్ని ఇటీవల పడగొట్టినందున సదరు నిధులతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు బుధవారం ఉదయం భూమి పూజ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన ప్రియతమ నాయకులు,వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు భట్టిప్రోలు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి స్థలం వద్దకు బుధవారం వచ్చు చున్నారు.కావున గ్రామ లోని ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా సాయిబాబా కోరారు.
Post Comment