77వ గణతంత్ర దినోత్సవం నాడు మా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడికి దక్కిన అరుదైన గౌరవం.
నేషనల్ ప్రైడ్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్ – 2026 ని ప్రదానం చేసిన త్రేతాయుగ్ ఫౌండేషన్.
రాజధాని వాయిస్: నరసరావుపేట జనవరి 27.
నిరుపేదలకు సేవలందించడంలో నేనున్నానంటూ.. గత రెండేళ్లుగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల మన్నలను పొందుతున్న నిత్య సేవా తత్పరుడికి అత్యుత్తమ పురస్కారం ప్రదానం చేశారు. నరసరావుపేట పట్టణంలో నిరుపేదల ఆకలి తిరుస్తూ వారి కష్టాల్లో అండగా ఉంటూ అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తదానాలు చేపిస్తూ అనునిత్యం సేవా కార్యక్రమంలో ముందుటున్న మా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. స్వర్ణ నాగరాజు 77వ గణతంత్ర దినోత్సవం నాడు అత్యంత ప్రతిష్టాత్మమైన గౌరవం లభించింది. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని త్రేతాయుగ్ ఫౌండేషన్ వారు నేషనల్ ప్రైడ్ అండ్ ఎక్సలెన్స్ అవార్డ్ – 2026 డా. స్వర్ణ నాగరాజుకు ప్రధానం చేశారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి అండగా ఉంటున్నటువంటి స్వర్ణ నాగరాజు యువతకు చాలా ఆదర్శంగా తీసుకోవాలని వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నిత్యం చూస్తూ వారికి ఈ యొక్క అవార్డుని ప్రధానం చేశామని త్రేతాయుగ్ ఫౌండేషన్ నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.మా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ద్వారానే ఇటువంటి గౌరవం లభించిందని. ఈ గౌరవం మా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తున్న దాతలకు మరియు మా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ఈ యొక్క గౌరవాన్ని సమర్పిస్తున్నానని డా. స్వర్ణ నాగరాజు తెలియజేసారు.
Post Comment