నిండు జీవితానికి రెండు పొలీయో చుక్కలు
నిండు జీవితానికి రెండు చుక్కలు:
నాగుర్ వలి
రాజధాని వాయిస్:నకరికల్లు.
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించుకోవాలని జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి సీనియర్ నాయకులు మరియు జనసేన పార్టీ నకరికల్లు మండలం అధ్యక్షుడు బత్తిన శ్రీనివాసరావు అన్నారు.
నకరికల్లు మండలం గుండ్లపల్లిగ్రామంలోని గుండ్లపల్లి -2 ఆవరణలో నిర్వహించిన పోలియో చుక్కల కేంద్రంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్ళ లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ పోలియో చుక్కలను సకాలంలో వేయించడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, జనసేన పార్టీ నకరికల్లు మండలం అధ్యక్షుడు బత్తిన శ్రీనివాసరావు,ఆకుల అశోక్, రఘుపతి రాంబాబు, గుండ్లపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , బత్తుల జానకి రామయ్య, ఉపాధ్యక్షుడు చికిలి ఎర్ర జానయ్య, గుండ్లపల్లి గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ జూపల్లి మోష, డాక్టర్ మణికాంత్ ,ఎఎన్ఎం ఎంవీ భారతి, ఎస్ కె ఎన్ రంజాన్ బి, ఆశా వర్కర్,పి. లక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు, ఖాసిం భాష (వి) తదితరులున్నారు.



Post Comment