నాగార్జునసాగర్‌లో మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు..
గోదా జాన్‌పాల్ పర్యటన
రాజధాని వాయిస్: నవంబర్ 16
విపి సౌత్.
మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు గోదా జాన్‌పాల్ ఆదివారం మాతసరోవర్ వద్ద స్థానిక మాల మహానాడు నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ, మాలల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం నాయకులు జాన్‌పాల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చింతమల్ల శ్రీనివాసరావు, స్థానిక అధ్యక్షుడు చింతమల్ల యాకోబు, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి విజయ్, వైస్ ప్రెసిడెంట్ చెన్నకేశవరావు, ట్రెజరర్ ధనుంజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.



Post Comment