నష్టపోయిన రైతుల్ని ఆదుకోండి..
మాజీమంత్రి విడదల
రజిని వినతి
అన్నదాతలకు జరిగిన నష్టం గురించి కలెక్టర్‌కు వివరణ
తుఫాను నష్టాలపై కలెక్టర్‌కు వివరాలతో
వినతి అందజేత
రాజధాని వాయిస్: అక్టోబర్ 30 నరసరావుపేట.
మొంథా తుఫాను సష్టించిన బీభత్సంతో పల్నాడు జిల్లాలో ప్రధానంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులు సర్వం కోల్పోయారని మాజీమంత్రి విడదల రజిని జిల్లా కలెక్టర్ కతిక శుక్లా దష్టికి తీసుకెళ్లారు. గురువారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి తుఫాను నష్టం వివరాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. పల్నాడు జిల్లాలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున, నియోజకవర్గాన్ని ’వరద ప్రభావిత ప్రాంతంగా’ గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రజిని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
మూడు రోజుల దాటికి తీవ్ర నష్టం.
తుఫాను కారణంగా మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాల వల్ల చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రజిని కలెక్టర్‌కు వివరించారు. ఈ వర్షాల దాటికి వ్యవసాయ పంటలు, జాలాది తదితర ప్రాంతాల్లో నివాస గహాలు పడిపోగా, నాదెండ్ల మండలంలో పశువులు మతి చెందాయన్నారు. అలాగే విద్యుత్ లైన్లు, రహదారులు, త్రాగునీటి వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. చేతికందిన పంట పొలాల్లో ఇప్పటికీ నీళ్ళు ఇంకా నిలిచే ఉన్నాయని తెలిపారు. కొంతమంది ఇళ్లు పాక్షికంగా పూర్తిగా కూలిపోయి రోడ్డున పడ్డారని బాధితుల కష్టాలను రజిని కలెక్టర్‌కు దష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం వివరాలు సుమారుగా.
చిలకలూరిపేట మండలం.. పత్తి 2వేల ఎకరాలు, వరి 100 ఎకరాలు, మొక్కజొన్న 150 ఎకరాలు. యడ్లపాడు మండలం.. ప్రత్తి 4వేల ఎకరాలు, వరి 150 ఎకరాలు, మిర్చి 1,500 ఎకరాలు, ఉల్లి 100 ఎకరాలు. నాదెండ్ల మండలం…ప్రత్తి 5వేల ఎకరాలు, మొక్కజొన్న 100 ఎకరాలు, మిర్చి వెయ్యి ఎకరాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలోని పలు కాలనీలు నీట మునిగాయని, పట్టణంలోని సంజీవనగర్, తండ్రిసన్నిధి, సుగాలికాలనీ, వీరముష్ఠి కాలనీతో పాటు గణపవరం గ్రామంలోని శాంతినగర్, పసుమర్రులోని ఎస్టీ కాలనీ, యడ్లపాడులోని దింతెనపాడు, బోయపాలెంలోని సుగాలీకాలనీ, యడ్లపాడులోని సవళ్ల ప్రాంతాల్లో గహాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారని రజిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు తక్షణమే చేపట్టవలసిన చర్యలను ఆమె కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావిత గ్రామాలలో వేగంగా పర్యటించి ప్రజలకు అండగా నిలబడాలి. పంట నష్టం అంచనా కోసం సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని తీసుకుని, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న ప్రతి పైరు సాగు చేసిన రైతుకు న్యాయం జరిగేలా పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు అధిక మొత్తంలో పంట నష్ట పరిహారాన్ని తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను సమయంలో ఇళ్లల్లోకి వరద నీరు చేసి నష్టపోయిన వారికి అదనపు రేషను అందించి ఆదుకోవాలన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్, త్రాగునీరు, రహదారుల మరమ్మత్తులు చేసి వెంటనే పునరుద్ధరించాలి.
తుఫాను బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కలెక్టర్ కతిక శుక్లా సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు చేపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము విశ్వసిస్తున్నామని రజిని తెలిపారు.



Post Comment