దేవరంపాడులో స్వచ్చ ఆంద్ర స్వచ్చ దివాస్ కార్యక్రమం
రాజధాని వాయిస్ : అక్టోబర్ 18
రాజుపాలెం.స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం రాజుపాలెం మండలం దేవరంపాడు ఎంపీపీ స్కూల్లో పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రతతోనే మన ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్రతి వీధిలో ఉన్న పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసి చెత్త బండిలో వెయ్యాలని, ప్రజల నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రత వల్లే అంటు రోగాలు ఎక్కువగా వస్తాయని, స్వచ్ఛమైన గాలి లభించాలంటే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ప్రధానోపాధ్యాయులు,కూటమి నాయకులు అంగన్వాడి కార్యకర్తలు,వైద్య సిబ్బంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



Post Comment