దూసుకొస్తున్న మంతా తుఫాన్
రాజధాని వాయిస్:
అక్టోబర్ 24,అమరావతి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని ఏపి ఎస్డిఎంఎ తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మంతా తుఫాన్ గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం , ఆదివారం రోజులలో భారీ నుండి అతిభారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలు ఎత్తెన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.



Post Comment