దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు
రాజస్థాన్‌లో పశువుల ప్రదర్శనలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది.చండీగఢ్ రైతు తీసుకొచ్చిన ‘షాబాజ్’ అనే గుర్రం రూ.15 కోట్లు ధర పలకగా….రాజస్థాన్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన ‘అన్మోల్’ అనే దున్నపోతు ఏకంగా రూ.23 కోట్ల ధర పలికింది.రెండున్నరేళ్ల వయసున్న షాబాజ్ గుర్రం అనేక బహుమతులు గెలుచుకుంది.కొనుగోలుదారులు రూ.9 కోట్లు ఆఫర్ చేసినా, రైతు అమ్మడానికి నిరాకరించారు. అన్మోల్ దున్నపోతును రోజూ పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్ తో పెంచుతున్నట్లు రైతు తెలిపారు.



Post Comment