దీపావళి మందుల షాపుల పరిశీలన
ఎమ్మెల్యే అరవింద్ బాబు
రాజధానివాయిస్: అక్టోబర్ 20,నరసరావుపేట.
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సత్తనపల్లి రోడ్డుపై గల కోడెల శివప్రసాదరావు స్టేడియంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన మందుల షాపులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రతా సౌకర్యాలను ఆసక్తిగా పరిశీలించి, వాటి నాణ్యతను పరీక్షించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. దీపావళి మందులపై పన్ను రాయితీలతో కూడిన ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని, దీని వల్ల కొనుగోలుదారులకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతుందని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకం దీపావళి షాపింగ్‌ను మరింత సరసమైనదిగా, సౌకర్యవంతంగా మార్చడమే కాక, స్థానిక వ్యాపారులకు కూడా ప్రోత్సాహం అందిస్తుందన్నారు.ఫైర్ సేఫ్టీ సౌకర్యాల విషయంలో, స్టేడియంలోని మందుల షాపుల వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీటి సరఫరా వ్యవస్థలు, ఇసుక బకెట్లు, అత్యవసర బయటకు వెళ్లే మార్గాలు పరిశీలించారు. దీపావళి పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. మందులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. సురక్షితమైన దీపావళి అందరికీ ఆనందకరమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



Post Comment