దీనమ్మ వర్షిత రోహన్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్స్ తనిఖీ…

రాజధాని వాయిస్:పిబ్రవరి 04

గుంటూరు.

సమగ్ర శిక్ష ఉత్తర్వులు మేరకు బీహార్ ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికుల కోసం దీనమ్మ వర్షిత రోహన్ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆధ్వర్యంలో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్స్ ను బుధవారం సమగ్రశిక్ష విభాగం సీఎంఓ అనిల్ కుమార్ ఏఎస్ఓ శేషగిరిరావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటుచేసిన అల్పాహారాన్ని రుసి చూసి సంతృప్తివ్యక్తం చేశారు విద్యార్థులకు విద్యాబోధన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు సమగ్ర శిక్ష అందించిన బ్యాగులు,షూ, నోట్ బుక్స్ ప్రతి విద్యార్థి దగ్గర చూసి ఆనంద వ్యక్తం చేశారు. విద్యార్థులకు కావలసిన యూనిఫామ్ అందజేస్తామని సీఎంఓ అనిల్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో గరికపాటి రంజిత్ కుమార్ వాలంటీర్స్ బాజీ, ఆశ,కుమారన్,రజియా బేగం, గాయత్రి,రత్నం,సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares