దిండి సముద్ర తీరంలో మూగజీవులు మృతి
రాజధాని వాయిస్: నవంబర్ 08
నిజాంపట్నం. మండల సముద్ర తీర ప్రాంతంలో సుమారు 25 ఆవులు గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనకు పాడి రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం సమీపంలోని రొయ్యల శుద్ధి పరిశ్రమలో వచ్చు వ్యర్ధాలను ఈ మూగజీవులు తినడం వలన ఈ పరిస్థితి వచ్చిందని మూగ శవాలు చనిపోవటానికి రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని రొయ్యల నుంచి వ్యర్థ పదార్థాలు ఒక నిర్ణీత ప్రదేశంలో వేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రోడ్లపై పడటంతో వాటిని ఆవులు తిని మృత్యువాత పడ్డాయని పాడి రైతులు తెలియజేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.



Post Comment