దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి
విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డిబిహెచ్ పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు.
రాజధానివాయిస్:నరసరావుపేట.
ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ ఊరికి దూరంగా స్మశానాలకు దగ్గరగా నెట్టి వేయబడుతున్న అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. న్యాయవాది చేపూరి వెంకటరావు మాట్లాడుతూ బోధించు సమీకరించు పోరాడు అని అంబేద్కర్ త్రిసూత్రాన్ని యువకులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచివంటిదని వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా నాయకులు అమ్మా జిలాని, టీడీపీ నాయకులు వెన్నా రవీంద్రారెడ్డి, బీజేపీ భాషా, గుంటి ప్రశాంత్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.



Post Comment