తుఫాన్ బాధితులకు అండగా డాక్టర్ వడ్డేంపూడి
రాజధానివాయిస్:అక్టోబర్ 29,రాజుపాలెం.
రాజుపాలెం మండలం,గణపవరం గ్రామంలో తుఫాన్ ప్రభావానికి గురైన పలు కాలనీలకు వెళ్లి ప్రజలను పరామర్శించిన సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్. గణపవరం గ్రామంలో వర్షాలు కారణంగా ఇబ్బందిపడుతున జంగాల కాలనీవాసులు కు పునరావాసం ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితిలపై తహసీల్దార్, ఎండిఓ ఏఈ పంచాయతీ సెక్రటరీలతో చర్చించి గ్రామంలో ఎటువంటి అసౌకర్యానికి తావు ఇవ్వద్దని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు బోజన సదుపాయాలను ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



Post Comment