తిరుమల లడ్డు లో అసలు నెయ్యి లేదు:సయ్యద్ నాగుర్ వలి
తిరుమల లడ్డులో అసలు నెయ్యి లేదు
జనసేన పార్టీ నకరికల్లు మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ నాగుర్ వలి
రాజధానివాయిస్:పిబ్రవరి 4,నకరికల్లు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. గత వైసిపి ప్రభుత్వం లో అసలు ఆవులు గాని డైరీ వ్యాపారం గాని లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేదు.
ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా 68 లక్షల కిజీల కల్తీ నెయ్యి సరఫరాలో 250 కోట్ల మేర అవినీతి చేశారు..
జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు ఇందులో ఉన్నాయి. ఇన్ని వాస్తవాలు ఉన్నా వైసిపి ఇంకా ఒక ఇంపు మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత , మా పాలనలో పలిచిన చేయగా వాస్తవాలు బయటపడ్డాయి.
వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కల్తీ సహజమే అని కామెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ప్రజల మీద చట్టం మీద ధర్మ మీద కనీస గౌరవ బాధ్యత లేవా……?
తిరుమల లడ్డు ప్రసాదంలో ప్రాథమిక ఆధారాల ప్రకారం జంతువు కలిసిందని ( N. D. D. B ) తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఇప్పుడు సిట్ చేసిన దర్యాప్తులో అసలు పాలే లేకుండా కేవలం రసాయనాలు వాడారని తేలింది.
జనసేన పార్టీ అధ్యక్షులు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా ఇచ్చిన నివేదికలను అనుసరించి గళం ఎత్తారు. ఒక పద్ధతి ప్రకారం తిరుమలను అవినీతి కేంద్రంగా వైసీపీ హయాంలోవినియోగించుకున్నారని విమర్శించారు.
Post Comment