తిరుమల లడ్డుపై టిడిపి…
అసత్య ప్రచారంపై బిజెపి స్పందించాలి..
వైసీపీ వరికూటి అశోక్ బాబు..
రాజధాని వాయిస్:
ఫిబ్రవరి 08 వేమూరు.
తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని టిడిపి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనివలన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు అన్నారు.ఆదివారం వేమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శ్రీవారి లడ్డులో పంది,చేప,గోడ్డు మాసం, కొవ్వు కలిపారని చెబుతూ భక్తులను మోసం చేస్తున్నారన్నారు. అధికారంలో వారే ఉన్నారు కాబట్టి, వారే కలిపి ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని
దీనిని భగవంతుడు కూడా క్షమించడన్నారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని, జగన్ సంక్షేమ పథకాలు అందించారని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, టిడిపి ఫ్లెక్సీలు తొలగించి, నేతలపై చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.



Post Comment