డిశంబర్ 21 న పోలీయో చుక్కల కార్యక్రమం


డిశంబర్  21న పల్స్ పోలియో కార్యక్రమం జయప్రదం చేయండి.

వైద్యాధికారులు జాఫ్రీన్, మహమ్మద్ షాద్

రాజధాని వాయిస్:క్రోసూరు.

 

డిశంబర్  21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు జాఫ్రీన్, మహమ్మద్ షాద్ లు తెలిపారు.ఈ సందర్బంగా  సోమవారం పల్స్ పోలియో బ్యానర్ను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్రోసూరు మండలంలో నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. డిసెంబర్ 21 పోలియో దినం సందర్భంగా అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఐదు ఏళ్ళ  లోపు చిన్నారులకు బూత్ స్థాయిలో పోలియో చుక్కలను వేస్తారని, ఆరోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయినా పిల్లలకు తిరిగి ఈనెల 22,23 వా తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో బృందాలు పోలియో చుక్కలు వేసింది లేనిది పరిశీలిస్తాయని పేర్కొన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ క్రోసూరు మండలంలో గుర్తించిన పలు ప్రాంతాలలో అనగా మురికివాడలు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాల్లోని నివసిస్తున్న ఐదు ఏళ్ళ  లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయటానికి మొబైల్ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాండ్రు కాశయ్య, అనుముల వెంకట్రాంరెడ్డి మార్కెట్ యార్డు డైరెక్టర్ దుద్దుల యోహాను మైనార్టీ నాయకులు హాసన్ హెల్త్ సూపర్వైజర్ శివుడు తదితరులు పాల్గొన్నారు.


 

Post Comment

You May Have Missed

0Shares