డాక్టరేట్ అందుకున్న పులివర్తి సోమయ్యకు…
ఘన సన్మానం..
రాజధాని వాయిస్ :ఫిబ్రవరి 05
కొల్లూరు.
మండల కేంద్రమైన కొల్లూరులోని జిల్లా పరిషత్ బాలురు విభాగ ఉన్నత పాఠశాలలో ఆవరణంలో బుధవారం సోమయ్య మిత్రబృందం , పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టరేట్ అందుకున్న పులివర్తి సోమయను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనీకాంత్ అధ్యక్షత వహించారు. తొలిత కుర్ర సత్యనారాయణ స్వాగత ఉపన్యాసం చేశారు.
కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వారిని పలు రంగ ఉద్యోగాలలో లభించడం అభినందనీయమని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో విద్యా సంస్థను స్థాపించి తొలిత ఎన్టీఆర్ ఫస్ట్ ద్వారా , మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులకు తమ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం తద్వా ఈ డాక్టరేట్ అవార్డు అందుకోవటం ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తున్నారు. కొల్లూరు తహశీల్దార్
బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పట్టుదలతో కొల్లూరులో కంప్యూటర్ విద్యను స్థాపించి ఉచిత శిక్షణ ఇవ్వటం ఆ విద్యార్థులను ఉద్యోగ బాటలో నడిపించడం ఆయన కృషికి ఫలితంగానే ఈ డాక్టరేట్ అవార్డు వచ్చిందని ఆయన అభినందించారు. ఎంపీడీవో నరసింహారావు మాట్లాడుతూ, దాతలు పట్టుకొని వాళ్ల సహకారంతో ఈ ప్రాంత పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి అవకాశం కల్పించిన పులివర్తి సోమయ్యను అభినందనీయమన్నారు కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ కొల్లూరు తాసిల్దార్ బి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నరసింహారావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రజనీకాంత్, బాలికల విభాగ ప్రధానోపాధ్యారాలు ధనలక్ష్మి, ఫోర్ ఫ్రెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత కుమారి రాజన్, సాయి వాసవి విద్యా సంస్థల డైరెక్టర్ ఉప్పు శ్రీనివాసరావు, కుర్ర సత్యనారాయణ,
గోరికపూడిప్రసాద్, గోగినేని చంద్రశేఖర్, పెదపూడి నాగరాజు, గృహలక్ష్మి అధినేత తుమాటి శ్యాంబాబు,అంబటి కిరణ్ బాబు మేడికొండ అనిల్ కుమార్, ధావులూరి ఏడుకొండలు, ఆర్.ఎం.పి ఏటుకూరి వరప్రసాద్, కొల్లూరు ఏఎస్ఐ అర్జున్ రావు, పి ఈ టి పెదపూడి నాగేశ్వరరావు తదితరులు డాక్టరేట్ అందుకున్న పులివర్తి సోమయ్య దృశ్యాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment